ఓటీటీలో లోకేశ్ కనగరాజ్ మూవీ!

  • తమిళంలో రూపొందిన సినిమా '29'
  • నిర్మాతలుగా స్టార్ డైరెక్టర్లు 
  • మే 8న విడుదలైన సినిమా 
  • ఈ నెల 5వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో 
  • 5 భాషల్లో అందుబాటులోకి

లోకేశ్ కనగరాజ్ పేరు వినగానే తెరపై భారీ యాక్షన్ దృశ్యాలు కళ్లముందు కదలాడుతూ ఉంటాయి. తుపాకులు .. తూటాల శబ్దాలతో థియేటర్లు దడలాడిపోతూ ఉంటాయి. అలాంటి లోకేశ్ కనగరాజ్ నుంచి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా వచ్చిందంటే, ఆశ్చర్యపోవడంలో అర్థం ఉంది. అయితే ఈ జోనర్ ను ఆయన టచ్ చేసింది నిర్మాతగా మాత్రమే. అవును ఆయన నిర్మించిన ఒక రొమాంటిక్ లవ్ స్టోరీనే '29'. తమిళంలో రూపొందిన ఈ సినిమాకి రత్నకుమార్ దర్శకత్వం వహించాడు.

ఈ మధ్య కాలంలో స్టార్ డైరెక్టర్లు ఒక వైపున తమ సినిమాలు చేస్తూనే, మరో వైపున నిర్మాతగాను ప్రయోగాలు చేస్తున్నారు. అలా కార్తీక్ సుబ్బరాజుతో కలిసి లోకేశ్ కనగరాజ్ నిర్మించిన సినిమానే '29'. విధు - ప్రీతీ అస్రాని జంటగా నటించిన ఈ సినిమా, మే 8వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ క్యూట్ లవ్ స్టోరీ యూత్ వైపు నుంచి మంచి మార్కులే తెచ్చుకుంది. ఫీల్ తో కూడిన ఈ కథకి బాగానే కనెక్ట్ అయ్యారు. 

అలాంటి ఈ సినిమా ఓటీటీ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' దక్కించుకుంది. ఈ నెల 5వ తేదీ నుంచి తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు. మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ నిర్మించిన సినిమా కావడంతో, ఈ సినిమా కోసం ఓటీటీ ఆడియన్స్ ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఓటీటీలో ఈ సినిమా ఒక ఊపు ఊపేసేలానే కనిపిస్తోంది మరి. 


-

More Telugu News